Monday, 30 November 2020

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు - Baludu Kadhammo balavanthudu Yesu - SANDHADI 2 LYRICS

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు

బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు

పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు -2

పరమును విడచి పాకలో పుట్టిన

పాపుల రక్షకుడు మన యేసయ్యా -2         

||బాలుడు||

కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు

ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా

ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి

పరుగు పరుగున పాకను చేరామే -2

మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము -2

మా మంచి కాపరని సంతోషించామే

సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)        

||బాలుడు||

చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము

పరిశుద్ధుని చూసి పరవశించామే

రాజుల రాజని యూదుల రాజని

ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా -2

బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము -2

ఇమ్మానుయేలని పూజించామమ్మో

సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4)         

||బాలుడు||

Share:

0 comments:

Post a Comment