సర్వజనులకు
సంబరమే
సర్వజనులకు
సంబరమే శ్రీ యేసు జననం సంబరమే
పట్టణాలలో
సంబరమే పల్లెటూళ్లలో సంబరమే
భూలోకమంతా
సంబరమే పరలోకమంతా సంబరమే
ప్రభు యేసు
జన్మించే భువిలో దూతలు పాడిరి దివిలో
సర్వోన్నతస్థలములలో
దేవునికే మహిమ
భువియందు
తనకిష్టులకు సమాధానము కలుగును గాక... కలుగును గాక... కలుగును గాక...
అ.ప: హ్యాపి హ్యాపి మెర్రి క్రిస్మస్.....
అంబరాన
నడిచెను నక్షత్రం ఆనంద భరితులు చేసెను స్తోత్రం
సంబరాలు చేయగ
ప్రతి గోత్రం యేసురాజుకే స్తుతిస్తోత్రం....5
మానవాళిని
రక్షింపను పాప చీకటి తొలగింపను
వ్యాధి బాధలు
తొలగింపను నీతిసూర్యుడు జనియించెను
||హ్యాపి||
పేదరికము
తొలగింపను శాపమంత తొలగింపను
చింతలన్ని
తొలగింపను శ్రీమంతుడేసు జనియించెను
||హ్యాపి||
శత్రుభయము
తొలగింపను మరణభయము తొలగింపను
కన్నీరంతా తొలగింపను
ఇమ్మానుయేలు జనియించెను
||హ్యాపి||
0 comments:
Post a Comment