Monday, 30 November 2020

వినరే యో నరులారా - Vinare yo narulara

వినరే యో నరులారా

వినరే యో నరులారా వీనుల కింపు మీర

మనల రక్షింప క్రీస్తు మానుజావతారుడయ్యె వినరే

అనుదినమును దే-వుని తనయుని పద

వనజంబులు మన-మున నిడికొనుచును    

||వినరే||

నర రూపు బూని ఘోర నరకుల రారమ్మని

దురితము బాపు దొడ్డ దొరయౌ మరియా వరపుత్రుడు

కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి

గి రయంబున ప్రభు కరుణను గనరే    

||వినరే||

ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష

బూని తన మేని సిలువ మ్రాను నణచి మృతి బొందెను

దీన దయా పరు-డైన మహాత్ముడు

జానుగ యాగము సలిపిన తెరంగిది    

||వినరే||

ఇల మాయావాదుల మాని యితడే సద్గురు డని

తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి

నిల జనులకు గలు-ములనలరెడు ధని

కుల కందని సుఖ-ములు మరి యొసఁగును    

||వినరే||

దురితము లణప వచ్చి మరణమై తిరిగి లేచి

నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె

బిరబిర మన మం-దర మా కరుణా

శరనిధి చరణ మె శరణని పోదము    

||వినరే||


Share:

0 comments:

Post a Comment