Monday, 30 November 2020

రారే చూతము రాజసుతుని - Raare Soothamu Raja Suthuni

రారే చూతము రాజసుతుని

రారే చూతము రాజసుతుని

రేయి జనన మాయెను -2

రాజులకు రారాజు మెస్సయ్యా -2

రాజితంబగు తేజమదిగో -2   

||రారే||

దూత గణములన్ దేరి చూడరే

దైవ వాక్కులన్ దెల్పగా -2

దేవుడే మన దీనరూపున -2

ధరణి కరిగె-నీ దినమున -2   

||రారే||

కల్లగాదిది కలయు గాదిది

గొల్ల బోయుల దర్శనం -2

తెల్లగానదే తేజరిల్లెడి -2

తార గాంచరే త్వరగ రారే -2   

||రారే||

బాలు-డడుగో వేల సూర్యుల

బోలు సద్గుణ శీలుడు -2

బాల బాలిక బాలవృద్ధుల -2

నేల గల్గిన నాథుడు -2   

||రారే||

 

యూదవంశము నుద్ధరింప

దావీదుపురమున నుద్భవించె -2

సదమలంబగు మదిని గొల్చిన -2

సర్వ జనులకు సార్వభౌముడు -2   

||రారే||


Share:

0 comments:

Post a Comment