Thursday, 31 December 2020

Daily Verses - 01 January 2021

                            Daily Verses - 01 January 2021  


 

నూతన సంవత్సరంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలంలటే ఏమి చేయాలి? 

గత సంవత్సరంలో చేసుకున్న తీర్మానాలను నెరవేర్చుకోలేకపోతే ఈ నూతన సంవత్సరం 2021లో దేవుని సన్నిధిలో చేసుకున్న తీర్మానాలను నెరవేర్చుకుందాం.దేవుని ప్రణాళికాబద్ధంగా జీవించాలి.

ఆలోచన అనేది మన జీవితంలో భాగం. మన ఆలోచనలు దేవునికి ఇష్టపూర్వకంగా, మహిమగా ఉండాలి యెషయా 43:18-19

మనము మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ, జరిగిన సంగతులను తలంచుకుంటూ, విపత్కర పరిస్థితులను, పత్రికూల పరిస్థితులను గురించి ఆలోచన చేస్తూ, బాధపడుతూ మన ముందున్న మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతారు. మనము నూతన సంవత్సరంలో దేవుని చిత్తానుసారమైన ఆలోచనలు చేయాలి

గత కాలంలో జరిగిన మేలులు, ఉపకారాలు మర్చిపోకుండా దేవుని స్తుతిస్తూ స్మరించుకుంటూ భవిష్యత్తు గురించి దేవునిలో ప్రార్ధనచేస్తూ ముందుకు సాగిపోవాలి. సంఘపరంగా, కుటుంబపరంగా దేవుడు ఒక నూతన క్రియను చేయబోతున్నాడని విశ్వసించాలి. ఇంతకుముందు మనము ఆశించినవి జరుగకపోతే అతి విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్ధించి నూతనవత్సరంలో పొందుకోవాలి పేతురు జీవితంలో అద్భుతమైన సంఘటన నీటిమీద నడవడమే

దేవుని వైపు చూచినంతకాలం నడుచుకుంటూనే వచ్చాడు. పేతురు ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను చూచాడో మునిగిపోవడం ప్రారంభించాడు. పేతురు మునిగిపోవడానికి కారణం తుఫాను గాని మరో పరిస్థితులు కాదు. అవిశ్వాసం, 

దేవుని నుండి  తన దృష్టిని మరల్చడం కాబట్టి మనము కూడా విపత్కర పరిస్థితులను బాధలను ఎదుర్కొనడానికి కారణం, దేవుని నుండి మన దృష్టిని మరల్చడం, దేవుని నుండి తొలగిపోవడం కాబట్టి మనము ఆయన చేసే కార్యాలమీద మన దృష్టి ఉంచితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాల్ని పొందగల్లుతాము 

ఫిలిప్పి 3:13-14

పౌలు వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను అని తన అనుభవాన్ని జీవిత ఆశయంగా సెలవిచ్చాడు

దేవుని ద్వారా కనికరం పొందబడి నేను రక్షణ పొందానని చెప్పిన పౌలు వాటిని మరచి జరిగిన వాటి గురించి ఆలోచన చేయకుండా జరగాల్సినవాటి గురించి తన ముందున్న పందెంలో ఓపికతో పరుగెడుతున్నాడు.విశ్వాసయాత్రలో పరుగెత్తి దేవుడిచ్చిన బహుమానాన్ని నూతన సంవత్సరంలో పొందుకోవాలి

 గలతీ 4:16-17

ఆత్మ సంబంధ విషయాల మీద పోరాడాలి. ఆత్మ సంబంధ విషయాల మీద పోరాడితే శరీర ఇచ్చల మీద దృష్టి పెట్టము. మన ఉద్దేశం మారాలి దేవునికోసం గురితో పరిగెత్తాలి గురిలేని బ్రతుకు గ్రుడ్డి బ్రతుకు గతకాలంలో జరిగిపోయిన విషయాలను లక్ష్యపెట్టకుండా, వాటిని గురించి దు:ఖ పడకూడదు

ఒక మంచి అభిప్రాయంతో ఉండాలి.దేవుని కొరకు నూతన కార్యాలు చేయాలి అని నిర్ణయి ంచుకుని మనం సాగిపోతే మన జీవితంలో మరి ఎక్కువగా మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటాం.

 

Share:

0 comments:

Post a Comment