Thursday, 21 January 2021

మనకు ఉన్నదానిని దేవునికి ఇచ్చుటకు గల ఐదు కారణములు :

 

మనకు ఉన్నదానిని దేవునికి ఇచ్చుటకు గల ఐదు కారణములు

1. మన జీవితాలు ఆశీర్వాదింపబడును : సామెతలు 3:9, 10; 28;20,

దేవునికి ఆయన సేవకు మనము ఏమీ అర్పించకపోతే ఆయన చిత్తానుసారముగా జీవించనట్లే.  మనకు ఉన్నదానిని అనగా రాబడిలో ప్రధమ ఫలమును ఆస్తిలో సగభాగమును, మనకు వున్న వాటిలో మొదటిగా దేవునికి ఇచ్చి దేవుని నుండి మరిన్ని ఆశీర్వాదములు పొందుదాము. నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి మన జీవితములో దేవునికి ప్రాదాన్యత, ప్రధమస్తానం ఇవ్వకుండా ధనవంతుడు అవ్వాలని ఆతురపడువాడు దేవుని యెద్ద శిక్ష నొందకపోడు.

మలాకి 3:10, లూకా 6:38

దేవునిపట్ల నమ్మకం కల్గి విధేయులై ధారాళంగా ఇచ్చేవారిని దీవించడమంటే దేవునికి ఎంతో ఇష్టం. ఈవిధంగా చేయకుండా ఆయన ఆశీర్వాదాలు ఆశించకూడదు.  తనను నమ్మిన వారి మేలుకోసం ఆయన అన్నిటిని,అన్ని పరిస్థితులలోను వాటిని అనుకూలపరచగల సమర్ధుడు.

 

2.   దేవుని పని ప్రోత్సహింపబడుతుంది:1తిమోతి 5:17,18 లేవీకాండము 19:1, ద్వితియో25:4

“పెద్దలు”, “నాయకత్వం” ఇద్దరూ ఒక్కటే ‘’ప్రకటించడం, నేర్పడంలో “రెట్టింపు గవరవం, మర్యాద” కేవలం వాటికే కాదు ఆర్ధిక సహాయానికి కూడా.

3.   దేవుడు మహిమపరచబడును; 2వ కొరింధీ 9;12

దేవునిపట్ల నమ్మకం కల్గి, విశ్వాసంతో ప్రార్ధిస్తూ, ఉదారంగా సంతోషంగా దేవుని కొరకు ఇవ్వాలి.  ఇహలోక సౌభాగ్యాన్ని మనం కోరుకకూడదు. మనకు సంపదలు కావాలని మనం కోరుతున్నామంటే దేవుని కోసం, ఆయన చిత్తానుసారంగా జీవిన్చేవారికోసం ఇవ్వగలిగేందుకే కోరాలి. కేవలం ఇవ్వడంవల్లనే దేవుని కృపకు మనలను పాత్రులనుగా చేస్తుంది అని అనుకోవడం పొరపాటు. మన ప్రార్ధనలో ఇతరులను జ్ఞాపకం చేసుకొంటూ, ప్రేమకల్గి జీవిస్తూ, ఆయన అడుగుజాడలలో నడుస్తూ ఆయన చిత్తనుసారం జీవించడమే ఆయనను మహిమపరచడం.

4.  అవసరతలో వున్న విశ్వాసులు ఆదరింపబడుదురు : అపొ :11:29 , 1వ యోహాను3:17

క్రైస్థవులు నామకార్థ క్రైస్థవులు కాక శిష్యులుగా ఉండడం గొప్ప విషయం.

5.  ఇతర క్రైస్థవులు కూడా సవాలుగా తీసుకొనెదరు : 2వ కొరింధీ 9:2

దేవుని పరిచర్యలో పాల్గొనటం గాని ఆయన నామం పేరటఇచ్చుటలో గాని ఆసక్తి చూపినట్లైతే మనము ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండగలము.

 

 

 

 

 

Share:

Related Posts:

0 comments:

Post a Comment