తప్పించుకొన
వీలులేని స్థితిలో గల వెర్రివాడు లూకా:12:16-21
ఒక ధనవంతుని భూమి సమృద్దిగా పండెను.
అప్పుడతడు నా పంట సమాకుర్చుకొనుటకు
నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేనీలాగు చేతును
అనుకొనెను. ఈ వ్యక్తి స్వభావం దేవునికి
కృతజ్ఞతలు చెప్పడం గాని, దేవుని పనికోసం ఇవ్వడంగాని, అవసరతలో ఉన్నవారికి సహాయం
చెయ్యడంగాని లేదు. ఈ వ్యక్తి
స్వప్రయోజనకారుడు, స్వార్థపరాయణుడు. తన
సుఖాలను గురించి తాను ఆలోచించుకునే
వ్యక్తి. ఉన్నవాటికంటె గొప్పవాటిని కట్టించి వాటిలో దాన్యమంతటిని సమకూర్చుకొని
ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడియున్నది తినుము,
త్రాగుము, సుఖించుము అని చెప్పును.
ఇక్కడ ఈ వ్యక్తి తెలివిగలవాడినని
తలంచాడు కాని దేవుడు మాత్రం తనను
తెలివి హీనుడిగా భావించాడు. స్వార్థం తెలివితక్కువతనమే,
(యెషయా55 :8-9) మన తలంపులోనుంచి ఉద్దేశాల్లోనుంచి దేవుణ్ణి ప్రక్కన పెట్టటం
అనేది తెలివి తక్కువతనమే.
(యాకోబు (4:
13-17)మనం చాల ఏళ్ళు జీవిస్థాములే అనుకోవడం, దేవుని చిత్తానుసారముగ కాకుండా మన
ఇష్టమొచ్చినట్లు జీవించడం తెలివితక్కువతనమే
దేవుడు మత్తయి (6:19-21)
లో చెప్పినట్లు చేయడం జ్ఞానం అనిపించుకొంటుంది. మన ప్రాణం, ఆయుషు దెవుని చేతుల్లో
వుంది. తనకిష్టమైనప్పుడు ఆయన
తీసేసుకోగలడు. దేవుని విషయంలో ధనవంతుడు అనే ఆశ్చర్యకరమైన మాట బైబిల్లో ఇక్కడ ఒక్కచోట మాత్రమే వుంది. సామెతలు 19:17
పోల్చిచూడండి. ఈ మాట తన విషయంలో ధనవంతుడు అనే మాటకు వ్యతిరేకం.
0 comments:
Post a Comment