మానవ జీవితమునకు సాదృశ్యములు – 4
·
ఆవిరి:(యకోబు:4-14,సామెతలు27-1)
· మానవులుగా
మనలో వున్న జీవము కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవును కాబట్టి రేపేమి సంభవించునో మనకు
తెలియదు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞానుసారముగా జీవించాలి.
·
ఊపిరి:(యోబు:-7-7)
· మనలో
వున్న జీవము వట్టి ఊపిరి వంటిది. ఇది వున్నంతకాలం మనలో జీవము వుంటుంది కాబట్టి
మనము దేవునియందు భయభక్తులు కలిగి జీవించాలి.
·
గడ్డి: (కీర్తనలు: 90-5,6, యకోబు: 1-10, కీర్తనలు 102-4)
· దేవుడు
నరులను పచ్చగడ్డితో పోల్చి యున్నాడు. ఇది ప్రొద్దున మొలిచి చిగురించి సాయంత్రము
కోయబడి వాడిపోవును.
·
పొగ: కీర్తనలు (102-3)
· నరుని
ఆయుష్షు పొగ ఎగిరి పోవునట్లుగా తరిగిపోవును ఈ సత్యమును తెలిసికొని మనము విశ్వాసముతో,
భయభక్తులుకలిగి ఆయన చిత్తనుసారముగా ఆయనకు ఇష్టులుగా జీవించాలి.
0 comments:
Post a Comment