Thursday, 7 January 2021

పేతురు చేసిన సూచకక్రియలు

 

పేతురు చేసిన సూచకక్రియలు

ఒక కుంటివానిని స్వస్తపరచెను అపో 3:6-8

(పేతురు వెండి, బంగారములు నా యొద్ద లేవుగాని నజరేయుడైన యేసుక్రీస్తునామమున నడవమని వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తగా  అప్పుడు అతని పాదములును చీలమండలును బలము పొందెను)

అనేకులను  స్వస్థపరచెను అపో 3:15

(పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీదులలోనికి తెచ్చివారిలో ఎవనిమీదనైనను వాని నీడ అయినను పడవలెనని వారిని మంచము మీదను పరుపులమీదను ఉంచిరి)

ఐనయా ను స్వస్థపరచెను అపో 9: 32-34

(పక్షవాయువు కలిగి ఎనిమిది యేండ్ల నుండి మంచము పట్టియుండిన ఒక మనుష్యుని చూచి దేవుడు నిన్ను స్వస్థ పరుస్తున్నాడు నీ పరుపు నీవే పరచుకొనమనిచెప్పగా వెంటనే అతడు లేచెను )

దొర్ఖాను తిరిగి బ్రతికించెను అపో 9: 36-41

(యెప్పెలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్ఖా అని పేరు ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను చేసియుండెను ఆమె కాయిలాపడి చనిపోగా శవమును మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గర ఉండుటచేత పేతురును పిలుచుటకు ఇద్దరు మనుష్యులను పంపిరి పేతురు వారితోకూడా మేడగదిలోనికి వెళ్లి సవమువైపు తిరిగి ప్రార్ధించాడు. పేతురు తబితా లెమ్మనగా  లేచి కూర్చుండెను)


Share:

0 comments:

Post a Comment