Monday, 22 May 2017

సుధా మధుర కిరణాల అరుణోదయం - Sudhamadhura kiranala Arunodayam

సుధా మధుర కిరణాల అరుణోదయం

 పల్లవి :-

సుధా మధుర కిరణాల అరుణోదయం

కరుణామయుని శరణం కరుణోదయం

తెర మరుగు హృదయాలు వెలుగైనవి

మరణాల చెరసాల మరుగైనది   

         ||సుధా||

చరణం 1 :-

దివి రాజుగా భువికి దిగినాడని రవి రాజుగా ఇలలో మిగిలాడని

నవలోక గమనాలు తెరిచాడని పరలోక భవనాలు పిలిచాయని

ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది

పాడే పాటల పశువులశాలాలు ఊయల చేసింది

ఆ జన్మమే ఒక మర్మమై ఆ బంధమే అనుబంధమై

||సుధా||

చరణం 2 :-

లోకాలలో పాప శోకాలలో ఏకాకులై  బ్రతుకు అవివేకులా

క్షమ హృదయ సహనాలు సమపాళ్ళుగా ప్రేమానురాగాలే  స్థిరాస్తిగా 

నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడాయేసు

నిత్య సుఖాలకు జీవజలాలకు  పెన్నిధి ఆ ప్రభువు 

నిను పావగా నిరుపేదగా జన్మించగా ఇల పండుగ             

||సుధా||

Share:

0 comments:

Post a Comment