ఆనందమే
పరమానందమే
ఆశ్రయపురమైన
యేసయ్యా నీలో -2
ఆపత్కాలములన్నిటిలో
ఆదరించిన
అక్షయుడా నీకే
స్తోత్రము -2
||ఆనందమే||
పచ్చిక గల
చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు
త్రాగనిచ్చితివే -2
నా ప్రాణమునకు
సేదదీర్చితివి
నీతియు
శాంతియు నాకిచ్చితివే -2
||ఆనందమే||
గాఢాంధకారము
లోయలలో నేను
సంచరించినా
దేనికి భయపడను -2
నీ దుడ్డు
కఱ్ఱయు నీ దండమును
అనుదినం
అనుక్షణం కాపాడునే -2
||ఆనందమే||
నా శత్రువుల
ఎదుటే నీవు
నాకు విందును
సిద్ధము చేసావు -2
నీతో నేను నీ
మందిరములో
నివాసము చేసెద
చిరకాలము -2
||ఆనందమే||
0 comments:
Post a Comment