నా హృదయాన
కొలువైన - యేసయ్యా
నా
అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే
కీర్తనీయుడా
నా
హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే
నీ సన్నిధిలో పూజార్హుడా - 2
నా హృదయాన
కొలువైన - యేసయ్యా.....
అగ్ని ఏడంతలై
- మండుచుండినను
అగ్ని జ్వాలలు
తాకలేదులే - నీ ప్రియుల దేహాలను - 2
అగ్ని బలము
చల్లారెనే - శత్రు సమూహము అల్లాడే నే - 2
నేను నీ
స్వాస్థ్యమే - నీవు నా సొంతమే
నా
స్తోత్రబలులన్నీ నీకేనయ్యా - 2
నా హృదయాన
కొలువైన - యేసయ్యా.....
అంతా
వ్యర్థమని - వ్యర్థులైరెదరో
నా గురి నీపై
నిల్పినందుకే - నా పరుగు సార్థకమాయెనే - 2
నీయందు పడిన
ప్రయాసము - శాశ్వత కృపగా నాయందు నిలిచెను - 2
నీపై
విశ్వాసమే - నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి
నిన్నే కీర్తింతును -
2
నా హృదయాన
కొలువైన - యేసయ్యా.....
విత్తినది
ఒకరు - నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది
ఎవ్వరైననూ - వృదిచేసింది నీవే కదా - 2
సంఘక్షేమాభివృదికే
- పరిచర్య ధర్మము నియమించినావే - 2
నీ ఉపదేశమే -
నన్ను స్థిరపరచెనే
నా స్వరము
నీకే అర్పింతును - 2
నా హృదయాన
కొలువైన - యేసయ్యా
నా
అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే
కీర్తనీయుడా
నా
హృదయార్పణతో - ప్రాణమిల్లేదనే - 2
నీ సన్నిధిలో పూజార్హుడా
నా హృదయాన
కొలువైన - యేసయ్యా ......
0 comments:
Post a Comment