Friday, 1 June 2018

ఈలాటిదా యేసు ప్రేమ - Eelatida Yesu Prema lyrics

ఈలాటిదా యేసు ప్రేమ

పల్లవి :

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను
తూలనాడక తనదు జాలి చూపినదా

చరణం 1  :

ఎనలేని పాప కూపమున నేను
తనికి మిణుకుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు వేగ
గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె
 

చరణం 2  :

పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను
మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
నను నీచుడని త్రోయలేక తనదు
నెనరు నా కగుపరచి నీతి జూపించె
 

చరణం 3  :

నెమ్మి రవ్వంతైనా లేక చింత
క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవ దలచి కరము
జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె
        

చరణం 4  :

పనికిమాలిన వాడనైన నేను
కనపరచు నా దోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత
ఘనమైన రక్షణ-మును నాకు చూపె
 

చరణం 5  :

నా కోర్కెలెల్ల సమయములన్ క్రింది
లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు

చరణం 6  :

శోధనలు నను చుట్టినప్పుడు నీతి
బోధ నా మనసులో పుట్టించి పెంచి
బాధలెల్లను బాపి మాపి యిట్టి
యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు
 

Eelatida Yesu Prema lyrics
Share:

0 comments:

Post a Comment