Showing posts with label Worship. Show all posts
Showing posts with label Worship. Show all posts

Friday, 1 June 2018

ఈలాటిదా యేసు ప్రేమ - Eelatida Yesu Prema lyrics

ఈలాటిదా యేసు ప్రేమ

పల్లవి :

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను
తూలనాడక తనదు జాలి చూపినదా

చరణం 1  :

ఎనలేని పాప కూపమున – నేను
తనికి మిణుకుచును నే దరి గానకుండన్
కనికరము పెంచి నాయందు – వేగ
గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె
 

చరణం 2  :

పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను
మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు
నను నీచుడని త్రోయలేక – తనదు
నెనరు నా కగుపరచి నీతి జూపించె
 

చరణం 3  :

నెమ్మి రవ్వంతైనా లేక – చింత
క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి
సమ్మతిని నను బ్రోవ దలచి – కరము
జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె
        

చరణం 4  :

పనికిమాలిన వాడనైన – నేను
కనపరచు నా దోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత
ఘనమైన రక్షణ-మును నాకు చూపె
 

చరణం 5  :

నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది
లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్
చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము
నా కొసంగె జీవింప నా రక్షకుండు

చరణం 6  :

శోధనలు నను చుట్టినప్పుడు – నీతి
బోధ నా మనసులో పుట్టించి పెంచి
బాధలెల్లను బాపి మాపి – యిట్టి
యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు
 

Eelatida Yesu Prema lyrics
Share:

ఇన్నేళ్లు ఇలలో - Innellu ilalo song

ఇన్నేళ్లు ఇలలో

పల్లవి :

ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో
గతించిపోయే కాలం – స్మరించు యేసు నామం
సంతోషించు ఈ దినం

చరణం 1  :

లోకమే నటనాలయం
జీవితమే రంగుల వలయం
 
పరలోకమే మనకు శాశ్వతం
పరలోక దేవుని నిత్య జీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిలపరచెనే రక్షణ భాగ్యం

చరణం 2  :

మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనసుకు మోక్షం
 
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించునే కలకాలం
 

 

Share: