Monday, 30 November 2020

మా చిన్ని యేసయ్య - Ma Chinni Yesayya

మా చిన్ని యేసయ్య

మా చిన్ని యేసయ్య

మాలోన నీవయ్యా

మా ఇంటి వెలుగయ్య

మా రాజు నీవయ్య

లోకమును కాచే కాపరివి నీవే

శోకమును తుంచే హృదయం నీదే

మసివాడే బ్రతుకుల్ని మార్చేయ రావా

||మా చిన్ని||

చీకటింట నీ నామం

వెలుగు నింపే ఓ దేవా

హల్లెలుయ స్తోత్రంతోనే

బాధలన్ని మరిచేనా 

||చీకటింట||

వీడియుండలేను నిన్ను మేము ఓ దేవా

బాధలందు మాకు కాస్త చోటు చాలయ్య

మా దేవా ! యేసయ్య! హల్లెలుయా!

||మా చిన్ని||

సిలువపైన నీ దేహం శిధిలమే అవుతుంటే

పాపమని ఎరుగక నిన్నే హింసలెన్నో పెట్టార 

||సిలువపైన నీ దేహం||

ఎంత దయ నీది క్షమియిన్చినావయ్య

క్షమాపనలో సారాన్నే బోధించినవయ్య

మా దేవా ! యేసయ్య! హల్లెలుయా!

||మా చిన్ని||


Share:

Related Posts:

0 comments:

Post a Comment