Monday, 30 November 2020

రక్షకుండుదయించినాడట - Rakshakundu udhayinchinaadata (Rakshakundudhayinchinadata)

రక్షకుండుదయించినాడట

రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ

రక్షకుండుదయించినాడట

రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార

తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము

||రక్షకుండు||

దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు -2

దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు

||రక్షకుండు||

గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత -2

తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త

||రక్షకుండు||

వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు -2

కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు

||రక్షకుండు||

పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి -2

శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె

||రక్షకుండు||

అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు -2

అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు

||రక్షకుండు||


Share:

0 comments:

Post a Comment