పల్లవి :
ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి
నా శ్రమ దినములలో –
కృపలతో కాచితివి
స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడా
మహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా
చరణం 1
:
ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టి
తల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి
నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపిన
లేని అర్హతలను నాకు వరముగా చేసిన దేవా
చరణం 2
:
కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండా
నీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా
శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపిన
హీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన దేవా
చరణం 3
:
గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినా
పదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా
నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగా
ఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా దేవా
0 comments:
Post a Comment