Showing posts with label u. Show all posts
Showing posts with label u. Show all posts

Sunday, 5 July 2020

ఉల్లసించి పాటపాడే పావురమా – Ullasinchi pata pade pavurama

ఉల్లసించి పాటపాడే పావురమా 

 

మృధు మధుర సుందర నారీమణీ

ఎద పవళించు నా ప్రాణేశ్వరీ

ఒక్క చూపుతో నీవాడనైతి

ఒక్క పిలుపుతో నీ వశమైతి

పావురమా నా పావురమా

నా నిర్మల హృదయమా... నా పావురమా

 

ఉల్లసించి పాటపాడే పావురమా

 

ఓ ఓ ఓ పుష్పమా.. షారోను పుష్పమా

వాగ్దానదేశపు అభిషేక పద్మమా

లెబనోను పర్వత సౌందర్యమా

 

పాలుతేనెలో పవళించి

పరిమళ వాసనలు విరజిమ్ము

జీవజలాలలో విహరించి

జీవఫలాలను ఫలియించు

ఉల్లసించి పాటపాడే పావురమా

నా పావురమా నా షారోను పుష్పమా

నా పావురమా నా షాలేము పద్మమ

॥ఓ ఓ ఓ పుష్పమా॥

జల్ధరు వాసనలు శ్వాసించి

జగతికి జీవమును అందించు

సంధ్యారాగము సంధించి

సుమధుర స్వరమును వినిపించు

ఉల్లసించి పాటపాడే పావురమా

నా పావురమా నా షారోను పుష్పమా

నా పావురమా నా షాలేము పద్మమా

॥ఓ ఓ ఓ పుష్పమా॥

Ullasinchi pata pade pavurama lyrics


Share:

Saturday, 2 June 2018

ఉన్నాడు దేవుడు నాకు తోడు


ఉన్నాడు దేవుడు నాకు తోడు

పల్లవి :

ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన

చరణం 1  :

గాఢాంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగి తేలినా
 
కరుణ లేని లోకము కాదన్ననూ
 

కన్నీరు తుడుచును నను కొన్నవాడు  

చరణం 2  :

యెహోవ సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును
 
కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును
 

బ్రతుకు కాలమంతయు హర్షింతును

Share:
Categories

ఉన్నపాటున వచ్చు..చున్నాను


315. ఉన్నపాటున వచ్చు...చున్నాను

పల్లవి :

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను

చరణం 1  :

కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని
ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ
 

చరణం 2  :

మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను

అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని  

చరణం 3  :

వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను
పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే
నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె

చరణం 4  :

కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె

చరణం 5  :

నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని
కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని

భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె 

చరణం 6  :

దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు
డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే

 

Share:
Categories

ఉన్నత స్థలములలో


ఉన్నత స్థలములలో

పల్లవి :

ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి
నా శ్రమ దినములలో – కృపలతో కాచితివి
 
స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడా

మహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా 

చరణం 1  :

ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టి
తల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి
 
నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపిన
లేని అర్హతలను నాకు వరముగా చేసిన
  దేవా

చరణం 2  :

కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండా
నీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా
శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపిన

హీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన దేవా  

చరణం 3  :

గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినా
పదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా
 
నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగా

ఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా దేవా 

Share:
Categories

ఉన్నతమైన రాజ్యపువాసీ - Unnathamaina Raajyapu Vaasi



ఉన్నతమైన రాజ్యపువాసీ

పల్లవి :

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యాఆ మహిమను విడిచావా ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యాఈ ధరణికి వచ్చావానీ జన్మ మనుజాలిపంట - సాతనుకే చితిమంటనా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా

చరణం 1  :

మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే

మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కానరాదే

మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా

మహిమను విడిచావా - ధరణికి వచ్చావా

చరణం 2  :

ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా

ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా కనుగొనలేమే

గుణహీనుడైన మానవుని ఋణము చెల్లింపదలిచావా

మహిమను విడిచావా - ధరణికి వచ్చావా 

చరణం 3  :

పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప

ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే

పురుగువంటి నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావా

మహిమను విడిచావా - ధరణికి వచ్చావా

Share:
Categories