ఉన్నతమైన రాజ్యపువాసీ
పల్లవి :
ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యాఆ మహిమను విడిచావా ఎన్నికలేని
పాపిని నాకై యేసయ్యాఈ ధరణికి వచ్చావానీ జన్మ మనుజాలిపంట - సాతనుకే చితిమంటనా
జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా
చరణం 1 :
మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే
మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కానరాదే
మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా
చరణం 2 :
ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా
ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా కనుగొనలేమే
గుణహీనుడైన మానవుని ఋణము చెల్లింపదలిచావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా
చరణం 3 :
పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప
ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే
పురుగువంటి నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా
0 comments:
Post a Comment